గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన కర్లపూడి వెంకాయమ్మ, ఆయన కుమారుడికి పోలీసులు న్యాయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. దాడి ఘటనపై డీజీపీ కు లేఖ రాసిన చంద్రబాబు....ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే వెంకాయమ్మపై ఆమె కుమారుడిపై వైసీపీ నాయకులు దాడికి దిగుతున్నారని చెప్పారు.